కోమటి చెరువు- నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్దిపేటలోని కోమటిచెరువు సుందరీకరణ పనులు, నెక్లెస్ రోడ్ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో మంత్రి పరిశీలించారు. మూడు రీచ్‌లుగా చేపట్టిన సుందరీకరణ పనులకు గానూ... మొదటి రీచ్ పనులు తుది దశకు చేరుకున్నాయని, రెండవ రీచ్ పనులు ముమ్మరం చేయాలని మున్సిపల్ డీఈ లక్ష్మణ్‌ను ఆదేశించారు.
'పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు' - harish rao visit
సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. కోమటి చెరువు- నెక్లెస్‌రోడ్డు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి... పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయానికి ఆదేశించారు.
'పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు'
రెయిలింగ్, ఆర్చ్, లైటింగ్, ఫుట్‌పాత్, కూర్చునే బల్లలు త్వరితగతిన పూర్తి చేసి పనులు వేగంగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని సూచనలు చేశారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. ప్రస్తుతం నెక్లెస్ రోడ్ అభివృద్ధికై జరుగుతున్న నిర్మాణ పనులు... సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నిర్మాణాలు, ఏర్పాట్లపై అధికారులు, కాంట్రాక్టరును ఆరా తీశారు.