మత్స్యకారులు ఆర్థికంగా మెరుగుపడేందుకే ప్రతీ చెరువులో చేప పిల్లలు వేసి చేయూతనిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ గ్రామ చెరువులో మంత్రి చేప పిల్లలను వదలారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. వారికి గతంలో చేపలు అమ్ముకోవడానికి మోటార్ సైకిల్ కూడా ఇచ్చినట్లు తెలిపారు.
'మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది' - siddipet news
సిద్దిపేట జిల్లా రాఘవాపూర్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. గ్రామ చెరువులో చేప పిల్లలు వదిలారు. మత్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
minister harish rao visited in ragavapur
జిల్లా పరిధిలో ఉన్న రిజర్వాయర్లలో కూడా చేపలు వేస్తామని... అక్కడ మత్స్యకారులకు కూడా చేపలు పట్టుకుని అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. గ్రామాల్లో ప్రతి చెరువు, కుంటల్లోనూ ప్రభుత్వం ద్వారా చేపల పంపిణీ చేసి మత్స్యకారులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ రోజా శర్మ, సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, గ్రామ మత్స్యకారులు, అధికారులు పాల్గొన్నారు.