తెలంగాణ

telangana

ETV Bharat / state

'నట్టల వ్యాధి నివారణకు కృషి చేసి జీవాలను రక్షించుకోవాలి' - minister harish rao on Prevention of nut disease

గ్రామాల్లో జీవాలు ఎక్కువగా ఉన్న చోట గొర్రెల షెడ్లు నిర్మించి ఆదర్శంగా నిలిచేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని మంత్రి హరీశ్​రావు సూచించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం గంగాపూర్​లో పర్యటించిన మంత్రి... గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను వేశారు. మేకలు, గొర్రెలలో వచ్చే నట్టల వ్యాధి నిర్మూలన కోసం టీకా మందులను వేయించాలని కోరారు.

minister harish rao visited in gangapur
minister harish rao visited in gangapur

By

Published : Dec 3, 2020, 6:42 PM IST

సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం గంగాపూర్​లో ఆర్థిక మంత్రి హరీశ్​రావు పర్యటించారు. గ్రామంలోని గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులను జడ్పీ ఛైర్​పర్సన్​ వేలేటి రోజారాధాకృష్ణ శర్మతో కలిసి వేశారు. మేకలు, గొర్రెలు పెంపకం చేసే కాపలాదారులు తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలను వేయించాలన్నారు. ఎలాంటి వ్యాధులు వ్యాపించినా... వెంటనే పశువైద్య సిబ్బందిని సంప్రదించాలని కోరారు. మేకల, గొర్రెల పెంపకంతో రైతులు మరింత ఆర్థికాభివృద్ధి చెందుతారని సూచించారు.

రైతులకు మంత్రి సూచనలు...

గంగాపూర్ గొర్రెల హాస్టల్​లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని.. వాటిని సరిచేసుకోవాలన్నారు. ఇప్పటికే ఎనిమిదిన్నర లక్షలు మంజూరు చేసుకున్నామని తెలిపారు. షెడ్డులోనే గొర్రెల కాపరులు ఉండేందుకు వీలుగా షెడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి భరోసా ఇచ్చారు. గంగాపూర్ స్వచ్ఛ గ్రామం అయ్యేలా అందరూ కృషి చేయాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ వైద్యాధికారులు షెడ్లు సందర్శిస్తూ... ఎప్పటికప్పుడు మూగ జీవాల ఆరోగ్య పరిస్థితి పరీక్షించాలని మంత్రి ఆదేశించారు.

ఇదీ చూడండి: 'కేసీఆర్​ కంటే పువ్వాడ గొప్పవాడనే విషయం నాకు తెలియదు'

ABOUT THE AUTHOR

...view details