తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాక మండలంలో పర్యటించిన మంత్రి హరీష్​ రావు - దుబ్బాక ఉపఎన్నికలు

దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి హరీష్​ రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పలు గ్రామాల్లో మా ఓటు తెరాసకే అంటూ ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేసి తీర్మాన ప్రతులను మంత్రికి అందజేశారు.

Minister Harish Rao visited Dubbakka Mandal in siddipet district
దుబ్బాక మండలంలో పర్యటించిన మంత్రి హరీష్​ రావు

By

Published : Sep 20, 2020, 11:10 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పోతా రెడ్డి పేట, నగరం, శిలాజీనగర్, వెంకటగిరి తండా, పెద్ద చికోడ్, హబ్సీపూర్ తదితర గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాజీనగర్, వెంకటగిరి తండా, పద్మశాలిగడ్డ, నర్లేంగడ్డ గ్రామాలకు చెందిన ప్రజలు తెరాస పార్టీకి ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసి తీర్మాన ప్రతులను మంత్రి హరీష్ రావుకు అందజేశారు. పలు గ్రామాల్లో ప్రజల నుంచి మంత్రికి వినతులు వెల్లువెత్తాయి.

భాజపాబావుల వద్ద, బోర్ల వద్ద మీటర్లు పెడతామని పార్లమెంటులో బిల్లు పెడుతోందని.. కానీ సీఎం కేసీఆర్ ఉచితంగా కరెంటు ఇస్తున్నారని మంత్రి హరీష్​ అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెరాస ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఇవీ చూడండి: ఎన్నిక ఏదైనా.. గెలుపు తెరాసదే కావాలి: మంత్రి పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details