నదిలేని చోట ఆనకట్ట...
Harish Rao On Mallanna Sagar: నదిలేని చోట కట్టిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ నడిగడ్డపై నిర్మితమైందని.. రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా నీరిచ్చేలా ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. జంటనగరాల తాగునీరు, పారిశ్రామిక అవసరాలతో పాటు రాష్ట్రంలో సగానికిపైగా జిల్లాల్లో తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చేలా ఈప్రాజెక్టును సీఎం కేసీఆర్ స్వయంగా రూపకల్పన చేశారని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. తక్కువ ముంపుతో మల్లన్నసాగర్ జలాశయం నిర్మాణం జరిగిందని... నిర్వాసితుల కోసం గజ్వేల్‌లో ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మించామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
'రెండు టీఎంసీ నీరు మల్లన్న సాగర్‌కు రావడమంటే 22వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం నిరంతరం మల్లన్న సాగర్‌లోకి వస్తుంది. నదికి కొత్త నడక నేర్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ గోదావరి నీళ్లను వెనక్కు తీసుకొచ్చి కూడవెళ్లిలో కలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. 90మీటర్ల ఎత్తులో ప్రవహించే గోదావరి నదిని 550 మీటర్ల ఎత్తులో ఉండే మల్లన్న సాగర్‌కు అంటే దాదాపు అరకిలోమీటర్‌కు ఎత్తి మల్లన్నసాగర్‌ను నింపడమనేది ఒక గొప్ప ప్రయత్నం. విమర్శలకు మా సమాధానం ఏమిటంటే పనితనమే సమాధానం.' -హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి