సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువును మంత్రి హరీశ్‌రావు సందర్శించారు. మినీ ట్యాంక్‌బండ్‌కు రోజురోజుకు పర్యటకుల తాకిడి పెరుగుతోందని అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న నెక్లెస్ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు.
సస్పెన్షన్ బ్రిడ్జ్, చెరువు కట్టలపై లైట్లు లేకపోవడం గమనించిన మంత్రి.. వాటిని ఏర్పాటు చేయాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించారు. రోజూ వారీగా టికెట్ల ఆదాయ వివరాలపై అధికారులను ఆరా తీశారు.