దుబ్బాక ఉపఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నానని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రజా తీర్పును శిరసావహిస్తామన్న హరీశ్‌రావు... తెరాసకు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు చెప్పారు. ఓటమికి కారణాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామన్నారు. తమ లోపాలను సవరించుకుంటామన్నారు.
దుబ్బాకలో ఓటమికి బాధ్యత వహిస్తున్నా: హరీశ్‌రావు - trs lose in dubbaka by elections
దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస ఓడిపోవటానికి బాధ్యత వహిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కారణాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామన్నారు. ఓడినా... దుబ్బాక ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామన్నారు.
![దుబ్బాకలో ఓటమికి బాధ్యత వహిస్తున్నా: హరీశ్‌రావు minister harish rao take responsbility for lose in dubbaka by election](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9501858-557-9501858-1605010755200.jpg)
minister harish rao take responsbility for lose in dubbaka by election
దుబ్బాకలో ఓటమికి బాధ్యత వహిస్తున్నా: హరీశ్‌రావు
ఓడినా... దుబ్బాక ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామన్నారు. దుబ్బాక ప్రజా సేవలో నిరంతరం పాటుపడతామని స్పష్టం చేశారు. సీఎం నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము: కేటీఆర్
Last Updated : Nov 10, 2020, 7:44 PM IST