'వేదఘోషతో సిద్దిపేట సుభిక్షం'
సిద్దిపేటలో తెలంగాణ వేద విద్యన్ మహాసభలు జరిపే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. నాలుగు రోజులు వేద ఘోషతో సిద్దిపేట సుభిక్షమవుతుందని హర్షం వ్యక్తం చేశారు.
సిద్దిపేటలో వేద విద్య మహాసభలు
వేద పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో తెలంగాణ వేద విద్యన్ మహాసభలు ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రాచీన దేవాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. నేటి తరం కూడా వేద పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. టెక్నాలజీ మోజులో పడి ధర్మాన్ని మరవద్దని సూచించారు.