స్వచ్ఛ సిద్ధిపేట పాఠశాలను రూ.50 లక్షలతో నాలుగో వార్డులో ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. విద్యార్థులకు, మహిళా సంఘాలకు స్వచ్ఛ బడిలో పాఠాలు చెబుతామన్నారు. ఏలా మనం స్వచ్ఛంగా ఉండాలి, ప్రస్తుత కరోనా, వైరల్ ఫీవర్, డెంగీ, వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా సిద్దిపేటలో ఒకటి, నాలుగో వార్డుల్లో సేంద్రీయ ఎరువుల తయారీ కేంద్రాలను ప్రారంభించుకున్నామని పేర్కొన్నారు. హరిప్రియనగర్లో వ్యర్థాల సేకరణ కేంద్రాల్లో చెత్తలను విభజించే మిషనరీలను ఆయన ప్రారంభించారు. పట్టణ ప్రజలు తడి, పొడి, హానికర చెత్త మూడు రకాల చెత్తలను వేర్వేరుగా చేసి ఇస్తున్నారని అన్నారు.
సేంద్రీయ ఎరువుల కేంద్రాలను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు - సేంద్రీయ ఎరువుల తయారీ కేంద్రాలను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
స్వచ్ఛ సిద్ధిపేట పాఠశాలను నాలుగో వార్డులో ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. త్వరలోనే స్వచ్ఛ బడి సిద్ధిపేట ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు. ఒకటి, నాలుగో వార్డుల్లో సేంద్రీయ ఎరువుల తయారీ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు.
మీరు ఇస్తున్న తడి, పొడి చెత్తలను ఈ యార్డులో క్రష్ చేసిన తర్వాత మూడు నెలల్లో ఎరువుగా తయారవుతుందని మంత్రి తెలిపారు. ఇక్కడ తయారయ్యే ఎరువు మన ఇళ్లలో పెంచుకుంటున్న పూల మొక్కలు, కూరగాయలు సాగుకు ఉపయోగపడుతుందున్నారు. ఈ ఎరువులు మొక్కలకు వేస్తే.. యూరియా, డీఏపీల కంటే బాగా పనిచేస్తాయన్నారు. ఈ ఎరువుతో పండిన పంటలు మన ఆరోగ్యాన్ని పెంచుతాయని తెలిపారు. ఇలాంటి సేంద్రీయ ఎరువు తయారు చేసుకునే అవకాశం మన వార్డులోనే మనకు లభించిందన్నారు. రాబోయే రోజుల్లో అన్నీ వార్డుల్లో కంపోస్టు యార్డులు ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు.
ఇదీ చూడండి :గొర్రెకుంట బావి ఘటనలో ఆధారాల అన్వేషణ