తెలంగాణ

telangana

ETV Bharat / state

సామూహిక గొర్రెల షెడ్లను ప్రారంభించిన మంత్రి హరీశ్​ - మంత్రి హరీశ్​ రావు

సిద్దిపేట జిల్లా ఇర్కోడ్​లో 9 సామూహిక గొర్రెల షెడ్లను మంత్రి హరీశ్​ రావు ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ గొర్రెల పంపిణీ చేపట్టి గొల్ల కుర్మల కుటుంబాల్లో వెలుగులు నింపారని హరీశ్ రావు చెప్పారు.

Minister Harish  rao started the mass sheep sheds siddipet ditrict
సామూహిక గొర్రెల షెడ్లను ప్రారంభించిన మంత్రి హరీశ్​

By

Published : May 17, 2020, 10:37 PM IST

సిద్దిపేట జిల్లా సిద్దిపేట గ్రామీణ మండలం ఇర్కోడ్ గ్రామ శివారులో 9 సామూహిక గొర్రెల షెడ్లను జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​తో కలిసి మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ గొల్లకుర్మల జీవనోపాధి కోసం, ఆర్థికంగా అభివృద్ధి చేందేందుకు గొర్రెల పంపిణీ చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

గొర్రెలకు మంచి వసతి ఉండే విధంగా సామూహిక గొర్రెల షెడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో గొర్రెల షెడ్లు నిర్మించామని, గొర్రెలను ఎవరూ అమ్ముకోవద్దని యాదవులకు మంత్రి సూచించారు. నియోజకవర్గ గొల్ల కుర్మలకు అండగా ఉంటామన్నారు. మంత్రికి తలపాగా కట్టి, శాలువతో ఆత్మీయంగా గొల్లకుర్మలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: సీఎం నిర్ణయాలతో వ్యవసాయ పరిస్థితులు మారాయి: నిరంజన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details