ఎన్నో ఏళ్ల నుండి రైతులకు నమ్మకం కలిగిన కంపెనీ ఫాల్కన్ అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు కోటికి పైగా ఫాల్కన్ పంపు సెట్లు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. సిద్దిపేటలో ఫాల్కన్ ఆథరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్‌ను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, డిస్ట్రిబ్యూటర్ బసంత్తో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. సర్వీసింగ్ సెంటర్ మొత్తం కలియ తిరిగి పరిశీలించారు.
సిద్దిపేటలో ఫాల్కన్ పంప్స్ ఆథరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్ ప్రారంభం - falcon company in siddipet
సిద్దిపేటలో ఫాల్కన్ పంప్స్ ఆథరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. రైతుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత పొంది మరిన్ని మంచి సేవలు ఈ ప్రాంత రైతులకు అందించాలని ఫాల్కన్ కంపెనీ నిర్వాహకులను మంత్రి కోరారు.
minister harish rao started falcon pumps servicing center in siddipet
ఫాల్కన్ కంపెనీ సర్వీసింగ్ సెంటర్‌ను సిద్దిపేటలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే సమయం ఆదాతో పాటు వ్యయప్రయాసల భారం తగ్గుతుందన్నారు. రైతుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత పొంది మరిన్ని మంచి సేవలు ఈ ప్రాంత రైతులకు అందించాలని ఫాల్కన్ కంపెనీ నిర్వాహకులను కోరారు.