తెలంగాణ

telangana

ETV Bharat / state

HARISH RAO: 'హుజూరాబాద్​లో తెరాస గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరు' - telangana varthalu

హుజూరాబాద్ నియోజకవర్గంలో తెరాస గెలుపును ఎవ్వరూ ఆపలేరని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్​ రావు అన్నారు. ఉపఎన్నికల్లో 50 వేల మెజార్టీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెరాస, భాజపా మధ్యనే పోటీ ఉంటుందని... ఈ పోటీలో తెరాసను గెలిపించి సీఎం కేసీఆర్​కు గిఫ్ట్​గా ఇవ్వాలని కార్యకర్తలను కోరారు. హుజూరాబాద్ రూరల్, పట్టణానికి సంబంధించిన ముఖ్య కేడర్, ఇంఛార్జీలతో సిద్దిపేట జిల్లా తెరాస పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు.

HARISH RAO: 'హుజూరాబాద్​లో తెరాస గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరు'
HARISH RAO: 'హుజూరాబాద్​లో తెరాస గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరు'

By

Published : Aug 2, 2021, 10:38 PM IST

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో తెరాస గెలుపును ఎవ్వరూ ఆపలేరని, ఉపఎన్నికల్లో 50 వేల మెజార్టీతో గెలుస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్​ రావు ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ రూరల్, పట్టణానికి సంబంధించిన ముఖ్య కేడర్, ఇంఛార్జీలతో సిద్దిపేట జిల్లా తెరాస పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. హుజూరాబాద్​లో తెరాస, భాజపా మధ్యనే పోటీ ఉంటుందని... ఈ పోటీలో తెరాసను గెలిపించి సీఎం కేసీఆర్​కు గిఫ్ట్​గా ఇవ్వాలని హరీశ్​ రావు కోరారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని.. ప్రతి ఇంటిని తట్టి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని కోరారు. కాళేశ్వరం ఫలాలు మొదటగా చేరింది.. హుజూరాబాద్​కేనని ఆయన వెల్లడించారు. గత వేసవిలో కూడా కాకతీయ కాలువ నిండా నీరు పారిందని, ఆ ఘనత తెరాస ప్రభుత్వానిదేనని అన్నారు.

హుజూరాబాద్ కేడర్​తో సమావేశం

తెరాసతో ప్రయోజనం పొందారు..

24 గంటలు కరెంట్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్, దళిత బంధు, మిషన్ భగీరథ లాంటి పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రచారం చేయాలని కోరారు. హుజూరాబాద్​లో అభివృద్ధిని విస్మరించి, నిర్లక్ష్యం చేసిన ఈటల రాజేందర్.. 17 ఏళ్లలో తెరాసతో ఎంతో ప్రయోజనం పొందారని పేర్కొన్నారు. కమలాపూర్, శామీర్​పేట్, మాసాయిపేట్, హుజూరాబాద్​లలో ఇళ్ల నిర్మాణం చేసుకున్న ఈటల రాజేందర్.. హుజూరాబాద్​లో 4 వేల ఇళ్లు పేదలకు మంజూరు అయినా ఎందుకు నిర్మించి ఇవ్వలేదని ప్రశ్నించారు. దేశంలో భాజపా ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందని మంత్రి హరీశ్​ రావు విమర్శించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని.. ప్రతి పేద వారి అకౌంట్​లో రూ.15 లక్షల రూపాయల ఇస్తామన్నారని.. భాజపా సర్కారు ఇస్తుందా అంటూ ప్రశ్నించారు.

హుజూరాబాద్​లో తెరాస గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరు

ఉద్యోగాలు భర్తీ..

భాజపా ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నందుకు ఆ పార్టీకి ఓటు వేయాలా అని నిలదీసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు లక్షా 32 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, త్వరలో 50 నుంచి 70 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు 15 వేల పరిశ్రమలు తెలంగాణకు వచ్చినట్లు చెప్పారు. ఈడబ్ల్యూఎస్ ద్వారా 8 లక్షల ఆదాయం ఉన్న వారికి కూడా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్​ కల్పించే విధంగా కేబినెట్​ ఆమోదించినట్లు హరీశ్​ రావు పేర్కొన్నారు. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలను అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ రెండు పట్టణాలతో కలిపి అర్బన్ డెవలప్ కమిటీ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: CM KCR Speech: 'సాగర్​కు రూ.150 కోట్లు... ఆరునూరైనా దళితబంధు అమలు చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details