రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. యాసంగిలో దేశంలోనే ఎక్కువగా ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తిలో సిద్దిపేట ఐదో స్థానంలో నిలిచిందని.. యాసంగిలో ఈ ఒక్క జిల్లాలోనే 5లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో కరువు కాటకాలతో వెనుకబడిన జిల్లాను అభివృద్ధి పరిచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఆయన వెల్లడించారు.
Harish rao: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపించిన ఘనత కేసీఆర్‌దే - telangana varthalu
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాక.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తిలో సిద్దిపేట ఐదో స్థానంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
Harish rao: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపించిన ఘనత కేసీఆర్‌దే
1983లో సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కోరారని... తెలంగాణ ఏర్పాటు అనంతరం సిద్దిపేటను జిల్లా చేయడమే కాకుండా అద్భుత భవన సముదాయాన్ని ఏర్పాటు చేయడం అరుదైన ఘట్టమన్నారు. ఎన్నో పోరాటాలతో, త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: CM KCR : సిద్దిపేటలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించిన సీఎం