తెలంగాణ

telangana

ETV Bharat / state

విపక్షాల కుట్రలను తిప్పికొట్టి.. మల్లన్న సాగర్​ ప్రాజెక్టు సాకారం: హరీశ్​ - harish speech at mallanna sagar project inauguration

Minister Harish Rao about Mallanna Sagar Project: ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్​ అని మంత్రి హరీశ్​ రావు అన్నారు. కేవలం మూడున్నరేళ్లలో మల్లన్న సాగర్​ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందంటే.. అది కేసీఆర్​ కృషి వల్లే అని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన భారీ జలాశయం మల్లన్నసాగర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారికంగా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి హరీశ్​ మాట్లాడారు.

mallanna sagar project inauguration
మల్లన్న సాగర్​ ప్రాజెక్టు

By

Published : Feb 23, 2022, 3:05 PM IST

Updated : Feb 23, 2022, 3:14 PM IST

Minister Harish Rao about Mallanna Sagar Project: విపక్షాల కుట్రలను తిప్పికొట్టి ముఖ్యమంత్రి కేసీఆర్​.. మల్లన్న సాగర్ ప్రాజెక్టును సాకారం చేశారని మంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు. ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడి కృషి వల్లే.. తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని కొనియాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో సగం తెలంగాణకు సాగు, తాగునీరు అందుతుందని హరీశ్‌రావు వెల్లడించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడు: హరీశ్‌రావు

ఎంతో ప్రత్యేకమైన రోజు

ఇవాళ ఎంతో ప్రత్యేకమైన రోజని.. మల్లన్న పుట్టినరోజుతో పాటు, మల్లన్న సాగర్​ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా విపక్షాల పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసిన రోజని మంత్రి హరీశ్​ అన్నారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టి కేసీఆర్ ప్రాజెక్టును పూర్తి చేశారని కొనియాడారు. సమైక్య పాలనలో వానాకాలం వచ్చినా ఈ ప్రాంతం ఎండాకాలం లాగానే ఉండేదని.. సీఎం కేసీఆర్​ పాలనలో సాగు నీటి ప్రాజెక్టులతో ఇప్పుడు ఏ కాలం చూసినా తెలంగాణ వానాకాలం లాగానే ఉందని హర్షం వ్యక్తం చేశారు.

"ఇవాళ మల్లన్న పుట్టినరోజు.. 4 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు కేసులు కొట్టేసిన రోజు. విపక్షాల కుట్రలను తిప్పికొట్టి కేసీఆర్‌ మల్లన్నసాగర్‌ను పూర్తిచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడు. తక్కువ సమయంలో ప్రాజెక్టు నిర్మాణం జరిగిందంటే కేసీఆర్‌ కృషి వల్లే. సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాంతం వానాకాలం కూడా ఎండాకాలం లాగే ఉండేది. కానీ తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్​ సారథ్యంలో ఇప్పుడు ఏ కాలం చూసినా వానాకాలం లాగే ఉన్నది."-హరీశ్​ రావు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి

అద్భుత ఘట్టం

సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్​లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన మల్లన్న సాగర్​ రిజర్వాయర్​ను సీఎం కేసీఆర్​ ప్రారంభించారు. 50 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. మల్లన్న సాగర్​ ద్వారా 15.70 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. హైదరాబాద్​కు తాగునీటి కోసం 30 టీఎంసీలు సరఫరా చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్​ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భుత ఘట్టం... మల్లన్నను తాకిన గోదారమ్మ..

Last Updated : Feb 23, 2022, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details