సిద్దిపేట జిల్లా స్వచ్ఛతకు మారుపేరుగా.. పచ్చదనంతో పరఢవిల్లుతూ.. ప్రగతి పథంలో దూసుకెళ్లాలన్నదే తన కోరిక అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. పట్టణంలో పర్యటించిన మంత్రి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం దాదాపు వేయి మంది ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు నిత్యావసరాలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందించే వాహనాన్ని ప్రారంభించారు.
విద్యాసంస్థల పునఃప్రారంభంపై త్వరలోనే నిర్ణయం : మంత్రి హరీశ్ - తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం
కరోనా ప్రభావంతో ఎన్నో రంగాలు కుదించుకుపోయాయని, ప్రపంచ, దేశ ఆర్థిక వృద్ధిరేటు +8 శాతం నుంచి -24 శాతానికి పడిపోయిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి.. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు
సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు
కరోనా ప్రభావంతో మూతపడిన ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. త్వరలోనే సిద్దిపేటలో 200 ఎకరాల్లో ఆక్సిజన్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
TAGGED:
minister harish rao