నియంత్రిత సాగు విధానం ద్వారా రైతుల ఇంట లాభాలపంట పండటం ఖాయమని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు జోస్యం చెప్పారు. కాళేశ్వరం జలాలతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండు పంటలు పండుతాయని అన్నారు.
'నిజమైన నిరుపేదలను గుర్తించి ఇళ్లను ఇస్తున్నాం' - సిద్దిపేట జిల్లా ఇర్కోడ్‌లో పర్యటించిన మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట జిల్లా ఇర్కోడ్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. కోటి 50 లక్షలతో నిర్మించిన 25 రెండు పడక గదుల ఇళ్లను ఆయన ప్రారంభించారు. 3 కోట్లతో నిర్మిస్తున్న ఐటీఐ అదనపు భవనానికి భూమి పూజ చేశారు.
సిద్దిపేట జిల్లా ఇర్కోడ్‌లో కోటి 50 లక్షలతో నిర్మించిన 25 రెండు పడక గదుల ఇళ్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం 3 కోట్లతో నిర్మిస్తున్న ఐటీఐ అదనపు భవనానికి భూమిపూజ చేశారు. పేదవాళ్లు ఆత్మగౌరవంతో బతకాలనే డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఎంత ఖర్చైనా వెనకాడకుండా ప్రభుత్వం కట్టిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ రోజా శర్మ, సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఎలాంటి సమస్య ఉన్న తమను సంప్రదించండి: మంత్రి ఎర్రబెల్లి