కొత్త రెవెన్యూ చట్టంతో రైతుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. పొలం గట్టు సమస్యలకు సర్వే ద్వారా చరమగీతం పాడతామని స్పష్టం చేశారు.
సర్వేతో గట్టు గొడవలు లేకుండా పోతాయి: హరీశ్ రావు - మంత్రి హరీశ్ రావు తాజా వార్తలు
సిద్దిపేట జిల్లా దుంపలపల్లిలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కొత్త రెవెన్యూ చట్టంతో భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మంత్రి అన్నారు.
సర్వేతో గట్టు గొడవలు లేకుండా పోతాయి: హరీశ్ రావు
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం దుంపలపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. భాజపా రైతు వ్యతిరేక విధానాలకు దేశం అట్టుడుకుతోందని హరీశ్ రావు పేర్కొన్నారు.
ఇదీ చూడండి :లైవ్ వీడియా: దొంగలు వచ్చి బెదిరించి దోచుకెళ్లారు