తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా సోకడం నేరం, ఘోరమేం కాదు.. బాధితులపై వివక్ష సరికాదు'

సిద్దిపేటలో మంత్రి హరీశ్​రావు పర్యటించారు. ఆరో వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు​తో కలిసి ఆయన ప్రారంభించారు. కరోనా అంటే.. నిర్లక్ష్యం, భయం వద్దని మంత్రి ప్రజలకు సూచించారు.

By

Published : Jul 9, 2020, 4:34 PM IST

Minister Harish Rao said does not want to look down on coroners
కరోనా సోకిన వారిపై చిన్నచూపు వద్దు: మంత్రి హరీశ్​రావు

సిద్దిపేట మున్సిపల్ ఆరో వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సుతో కలిసి మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. ఈనెల 15న సిద్దిపేటలో కరోనా పరీక్షా కేంద్రం ప్రారంభిస్తామని చెప్పారు. చిట్కాలు పాటించి కరోనా బారి నుంచి మనల్ని మనమే కాపాడుకుందామని మంత్రి అన్నారు.

చిన్నచూపు వద్దు

కరోనా సోకిన వారిపై ప్రేమను చూపాలని మంత్రి కోరారు. వారిని సమాజంలో చిన్నచూపుగా చూడొద్దని.. అలా చేయడం తప్పని చెప్పారు. కరోనా రావాలని.. ఎవరూ కోరుకోరని, రాకుండా అందరూ జాగ్రత్త పడుతూ.. మన జాగ్రత్తలో మనం ఉండాలని సూచించారు. కరోనా వస్తే చేయరాని నేరం, ఘోరం చేసినట్లు, సామాజికంగా బహిష్కరించడం సరికాదన్నారు.

జాగ్రత్తగా ఉండాలి

కరోనా ఎవరికీ రావొద్దని కోరుకుందామని, ఒకవేళ వస్తే అండగా ఉందామని చెప్పారు. కరోనా విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.

ఇదీ చూడండి :హైదరాబాద్​ ఆస్పత్రుల్లో "నో బెడ్స్‌" బోర్డులు దేనికి సంకేతం?

ABOUT THE AUTHOR

...view details