సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలాపూర్, రంగనాయక సాగర్ ఇరిగేషన్ అధికారులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష జరిపారు. స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా నీటి వనరులకై ఇంజినీర్లు ఆలోచన చేయాలన్నారు. అప్పుడే ఆ ప్రాంత ప్రజలకు శాశ్వతంగా నీటి వనరులు లభిస్తాయన్నారు. ఆ దిశగా ఇరిగేషన్ అధికారులు పని చేయాలని మంత్రి సూచించారు. ప్రధానంగా సిద్దపేట, దుబ్బాక నియోజక వర్గాల్లో కాల్వల భూ సేకరణ ప్రక్రియపై ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష - మంత్రి హరీశ్‌రావు తాజా వార్తలు
సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమావేశం నిర్వహించారు. కాలువలు, పిల్ల కాల్వల అసంపూర్తి పనులన్నీ త్వరగా పూర్తి చేయాలన్నారు. సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాల్లో కాల్వల భూ సేకరణ ప్రక్రియపై అధికారులతో చర్చించారు.
ఎత్తుగా ఉండే ప్రాంతాలకు కాల్వల ద్వారా సాగునీరు అందే విధంగా లిఫ్టు అంశంపై అధికారులతో చర్చించారు. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, తపాస్ పల్లి, గండిపల్లి రిజర్వాయర్లు, వాటి కాల్వలు, ఆయకట్టు కింద వచ్చే చెరువులు, కుంటలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కాలువలకు అడ్డుగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం తదితర విషయాల్లో అధికారులకు సూచనలు చేశారు. ఈ సమీక్షలో కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్, ఎస్ఈ ఆనంద్, తపాస్ పల్లి ఎస్ఈ సుధాకర్ రెడ్డి, డిప్యూటీ ఈఈ రవీందర్ రెడ్డి, ఇరిగేషన్ అధికారిక సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :రోడ్డుపై శానిటైజేషన్ స్ప్రే చేసిన హోంమంత్రి