పదో తరగతిలో టెన్ బై టెన్ గ్రేడ్ సాధించిన ప్రతి విద్యార్థికి రూ. 25 వేల చొప్పున అందజేస్తానని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ భవన్లో 2020 పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతం పెంచే దిశగా జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు, ఎయిడెడ్ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, డీఈఓ రవికాంత్, జిల్లాలోని మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు హాజరయ్యారు. సిద్దిపేట జిల్లాను పదో తరగతి ఫలితాల్లో గతేడాది రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిపేలా కృషి చేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.
టెన్ బై టెన్ వస్తే.. ప్రతి విద్యార్థికి రూ. 25 వేలు ఇస్తా: హరీశ్ - సిద్దిపేటలో హరీశ్‌రావు సమీక్ష
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ భవన్లో 2020 సంవత్సరం పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతం పెంచే అంశంపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు.
సిద్దిపేటలో హరీశ్‌రావు సమీక్ష