కొవిడ్ కష్ట కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులకు జీవనభృతి అందించేందుకు సీఎం కేసీఆర్.. మానవతా దృక్పథంతో జీవనభృతి నిర్ణయం తీసుకున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందికి ప్రభుత్వం అందిస్తున్న జీవనభృతిపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాలు, యాజమాన్యాలతో కలిసి కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు.
'అర్హులందరికీ రూ. 2వేలు, బియ్యం అందేలా చూడాలి'
ప్రైవేటు అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జీవన భృతిపై సిద్దిపేట జిల్లా అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. అర్హులందరికీ భృతి, రేషన్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మంత్రి హరీశ్ రావు సమీక్ష, ప్రైవేటు టీచర్లకు భృతి
దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ కార్యక్రమం చేపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. అర్హులందరికీ రూ. 2 వేలు, 25 కిలోల బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు ఆదేశించారు.
ఇదీ చదవండి:జలశక్తి శాఖను సంప్రదించండి.. కాళేశ్వరంపై పిటిషనర్‌కు ఎన్జీటీ సూచన