సిద్దిపేట జిల్లాలో సంక్రాంతి పండుగకు ముందే రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి తుది జాబితాను వార్డుల్లో ప్రదర్శించాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. పండుగ తర్వాత ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని సూచించారు.
'ఆ విషయంలో నేను జోక్యం చేసుకోను' - మంత్రి హరీశ్ రావు
సంక్రాంతి పండుగకు ముందే సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఇతర మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
!['ఆ విషయంలో నేను జోక్యం చేసుకోను' minister harish rao review meeting on double bed room scheme](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5444063-thumbnail-3x2-harish.jpg)
డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంపై మంత్రి హరీశ్ రావు సమీక్ష
డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంపై మంత్రి హరీశ్ రావు సమీక్ష
ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని, క్షేత్ర స్థాయిలో 20 ప్రత్యేక టీంలు పరిశీలన జరిపేటప్పుడు దరఖాస్తుదారులతో మాట్లాడి వివరాలు సేకరించాలని మంత్రి సూచించారు. అర్హులైన వారినే నిబంధనల మేరకు ఎంపిక జరపాలని , ఎలాంటి పొరపాట్లకు తావివ్వవద్దని చెప్పారు.
ఎంపిక పారదర్శకంగా ఉండాలన్న మంత్రి హరీష్ రావు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తాను జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. ఎవరి రికమెండేషన్లు పట్టించుకోవద్దని, ఎంపికలోఎవరైనా ఇబ్బంది పెడితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
- ఇదీ చూడండి: అత్యంత నిష్టతో "గురువులకు" శిక్షణ..!