'టేబుల్ టేబుల్‌కు తిరిగి దండం పెట్టినా పని కాలేదు.. అందుకే...' కేంద్ర జలశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు(harish rao response on gajendra singh shekhawat comments) స్పందించారు. సుప్రీంకోర్టులో కేసు వేసి అనవసర జాప్యానికి కారణమై.. ఇప్పుడు కేంద్రాన్ని బాధ్యులను చేయడం ఏమిటని గజేంద్ర షెకావత్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. కేంద్రం నుంచి సరైన స్పందన లేకపోవడం వల్లే మేము సుప్రీంకోర్టును ఆశ్రయించామని హరీష్ రావు(harish rao latest news) స్పష్టం చేశారు.
తాత్సారం జరిగిందనేది నిజమే కదా..
ఎన్నో సమస్యలున్నా మొదటి ప్రాధాన్యత నీళ్లకు ఇచ్చామని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్ చేసిన కృషికి ఇదే నిదర్శనమని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తమ నిజాయితీ, చిత్తశుద్ధిని కేంద్రమంత్రి షెకావత్ అర్థం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలపై తమకున్న శ్రద్ధను అర్థం చేసుకోవాలన్నారు. ఏడేళ్లుగా సమస్య పరిష్కారం కాలేదనేది వాస్తవమా కదా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు కేంద్రంలో తాత్సారం జరిగిందనేది నిజమే కదా అని నిలదీశారు.
చట్టం అమలు చేయాలి..
ఏడేళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందలేదని మంత్రి ఆరోపించారు. కేంద్రాన్ని చట్ట విరుద్ధమైన గొంతెమ్మ కోరికలు తమ ప్రభుత్వం కోరట్లేదన్న హరీశ్ రావు... నదీ జలాల్లో రాజ్యాంగబద్ధమైన, న్యాయమైన వాటా కోరుతున్నామని స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం(Interstate river waters dispute)పై సెక్షన్ 3 కింద ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన 42వ రోజే సెక్షన్ 3 కింద కేంద్రానికి ఫిర్యాదు చేశామన్నారు. ఫిర్యాదు చేసిన ఏడాదిలోగా సమస్య పరిష్కరించాలని చట్టం చెబుతోందన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ట్రైబ్యునల్‌కు సిఫార్సు చేయాలని కోరారు. చట్టం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని పేర్కొన్నారు.
టేబుల్ టేబుల్‌కు దండం పెట్టాం..
"మా పోరాటమే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఏడేళ్లుగా న్యాయమైన నీటి వాటా కోసం అడుగుతున్నాం. అంతరాష్ట్ర జల వివాదాల పరిష్కార చట్టం ప్రకారం జల వివాదాలు సంవత్సరంలోపు పరిష్కరించాలి. సెక్షన్- 3 ప్రకారం రాష్ట్రం ఏర్పడిన 42రోజుల్లో అప్పటి జల వనరుల శాఖ మంత్రికి ఫిర్యాదు చేశాం. ఇది మా పట్టుదల, నిజాయితీకి నిదర్శనం. 14 జూలై 2014 ఫిర్యాదు చేసినా.. ఇప్పటి వరకు పరిష్కారం జరగలేదు. ఏడేళ్ల నుంచి రాష్ట్ర హక్కులను కేంద్రం కాలరాసింది. పరిష్కారం కోసం అప్పట్లో టేబుల్.. టేబుల్‌కు తిరిగి దండం పెట్టాం. అప్పటి కేంద్ర జల శాఖ మంత్రి ఉమా భారతి న్యాయ సలహా కోరితే.. మాకు అనుకూలంగా సూచన వచ్చింది. కేంద్రం నుంచి సరైన స్పందన లేకపోవడం వల్లే మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాం." - హరీశ్‌రావు, మంత్రి
సంబంధిత కథనం..