సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ద్వారా యాసంగికి నీరు విడుదల చేశారు. చిన్నకోడూరు మం. చందలపూర్‌లో పరిధిలో నీటిని మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. సీఎం జన్మదినం సందర్భంగా చిన్నకోడూరువాసులకు తొలిసారి యాసంగికి నీరునందించారు.
రంగనాయకసాగర్ ద్వారా యాసంగికి నీరు విడుదల
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రైతులకు శుభవార్తను అందించారు మంత్రి హరీశ్‌రావు. రంగనాయకసాగర్ ద్వారా యాసంగికి నీరు విడుదల చేశారు. సిద్దిపేట, హుస్నాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాలకు సాగునీరు అందనుంది.
ఈ ప్రాంత ప్రజలకు గోదావరి నీళ్లు ఒక కల అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాళేశ్వరంతో ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు తెచ్చిన కేసీఆర్ జన్మధన్యమని వెల్లడించారు. యాసంగిలో ఒక్క మడి ఎండకుండా సాగు నీరు అందిస్తామని హామీనిచ్చారు. ఈ ప్రాంతంలో సాగునీటి వెతలకు సీఎం శాశ్వత పరిష్కారం చూపారని వ్యాఖ్యానించారు.
ఈ యాసంగిలో 50 లక్షల ఎకరాలు జిల్లాలో సాగులోకి వచ్చిందని హరీశ్ వివరించారు. ఒకనాడు తాగేందుకు గుక్కెడు నీళ్లులేని దుస్థితిలో ఉన్నామని గుర్తు చేశారు. కేసీఆర్ ముందుచూపుతో యాసంగికి నీళ్లిచ్చే స్థితికి చేరుకున్నామని వ్యాఖ్యానించారు. సిద్దిపేట, సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాలకు ఈ సాగునీరు అందనుంది.
- ఇదీ చూడండి:సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ