క్రీస్తు బోధించిన దయ, కరుణ, ప్రేమ ప్రపంచ మానవాళికి మార్గదర్శకాలని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుపతి వెళ్లడం జరిగిందని...అందుకే క్రిస్మస్ రోజు రాలేకపోయానని తెలిపారు. క్రిస్మస్ మాసంలో మొదటి ఆదివారం అయిన ఈరోజు ఏసు ప్రభు ఆశీస్సుల కోసం వచ్చానన్నారు.
'క్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి మార్గదర్శకాలు' - telangana news
క్రిస్మస్ పండుగ కానుకలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. క్రీస్తు బోధించిన దయ, కరుణ, ప్రేమ ప్రపంచ మానవాళికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. సిద్దిపేట చర్చిలో పాల్గొన్న మంత్రి క్రిస్టియన్ సోదరసోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్థికశాఖ మంత్రి హరీష్
సుఖశాంతులతో జీవించాలంటే క్రీస్తు బోధనలు ఆచరించాలని హరీష్ రావు తెలిపారు. అందరికి మంచి జరగాలని ప్రార్ధించానన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట చర్చి నిర్వాహకులు హరీష్ రావుని సన్మానించారు.
ఇదీ చదవండి:వలపు వలతో నిలువుదోపిడీ చేసే మాయలేడి అరెస్ట్