తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలి' - సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు పర్యటన

ప్రతి ఒక్కరు పరిసరాలను తమ ఇళ్లలాగే శుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలో రెండో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

minister harish rao participated in second phase of pattana pragathi program in siddipet
'సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలి'

By

Published : Jun 1, 2020, 9:43 AM IST

సిద్దిపేటలోని 6వ వార్డులో రెండో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. వార్డుల్లోని పలు కాలనీల్లో పాదయాత్ర చేశారు. కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా పారవేయాలని ప్రజలకు మంత్రి సూచించారు. వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ప్రతి ఆదివారం పది గంటల పది నిమిషాలకు కార్యక్రమంలో పట్టణ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు భాగస్వామ్యం కావాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details