తెలంగాణ

telangana

ETV Bharat / state

'గాంధీ అడుగుజాడల్లో నడవటమే మహాత్మునికిచ్చే ఘననివాళి' - గాంధీ జయంతి వేడుకలు

సిద్దిపేటలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్​రావు, ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​... మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

minister harish rao participated in gandhi jayanti celebrations at siddipet
minister harish rao participated in gandhi jayanti celebrations at siddipet

By

Published : Oct 2, 2020, 6:54 PM IST

గాంధీ అడుగుజాడల్లో నడవడమే నేటితరం మహాత్మునికిచ్చే ఘననివాళి అని మంత్రి హరీశ్​ రావు తెలిపారు.సామాజిక మార్పు కోసం అహింసా మార్గంలో అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ అని మంత్రి కొనియాడారు.

మహాత్ముని 151వ జయంతి సందర్భంగా.. సిద్దిపేటలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులల్పించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'ఓ బాపూ నువ్వే రావాలి.. నీ సాయం మళ్లీ కావాలి'

ABOUT THE AUTHOR

...view details