తెలంగాణ

telangana

ETV Bharat / state

బతుకమ్మ సంబరాల్లో మంత్రి హరీశ్​రావు - సిద్ధిపేట జిల్లా తాజా సమాచారం

సిద్దిపేట జిల్లాలో జరిగిన సద్దుల బతుకమ్మ సంబురాల్లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసి స్థానిక కోమటి చెరువులో విహరించారు. ఆయన సతీమణి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.

Minister harish rao partcipated in siddipeta bathukamma celebrations
సిద్దిపేట బతుకమ్మ సంబరాల్లో మంత్రి హరీశ్​రావు

By

Published : Oct 25, 2020, 5:43 AM IST

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. పట్టణంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి హరీశ్‌రావు దంపతులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక కోమటి చెరువులో విహరించారు. ఆయన సతీమణి మహిళలతో బతుకమ్మ ఆడారు.

రాష్ట్ర ప్రజలకు మంత్రి... బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని మంత్రి సూచించారు. బతుకమ్మకు పూజలు చేసి చెరువులో వదిలిపెట్టారు.

ఇదీ చూడండి:'ప్రకృతిని, దైవంలా పూజించే బతుకమ్మ ప్రపంచంలోనే గొప్ప పండుగ'

ABOUT THE AUTHOR

...view details