తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్ద చెరువుకు కాళేశ్వరం జలాలు.. మంత్రి హరీశ్‌ పూజలు - మంత్రి హరీశ్‌ రావు వార్తలు

కాళేశ్వరం జలాలతో సిద్దిపేట జిల్లా రాఘవాపూర్‌ గ్రామంలోని పెద్దచెరువు నిండి అలుగు పారింది. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ గంగమ్మ తల్లికి మంత్రి హరీశ్‌రావు జల హారతి చేశారు. అనంతరం గ్రామంలోని గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

harish rao, pedda cheruvu in raghavapur
మంత్రి హరీశ్‌ రావు, రాఘవాపూర్‌ పెద్ద చెరువు

By

Published : Mar 19, 2021, 5:47 PM IST

సిద్దిపేట జిల్లా సిద్దిపేట గ్రామీణ మండలంలోని రాఘవాపూర్‌ గ్రామ పెద్ద చెరువు.. కాళేశ్వరం నీళ్లతో జలకళ సంతరించుకుంది. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నుంచి రైతులకు సాగు నీరు అందించేందుకు కాళేశ్వరం కాలువల ద్వారా నీటిని వదిలారు. దీంతో ఐదు రోజులుగా వస్తున్న ఆ నీళ్లతో చెరువు నిండి అలుగు పారింది.

ఈ సంతోషంలో చెరువుకు మంత్రి హరీశ్ రావు జల హారతి చేపట్టారు. అనంతరం గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చెరువు నిండి అలుగు పారడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌లో విచారణ

ABOUT THE AUTHOR

...view details