తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత డయాగ్నోస్టిక్ హబ్ కేంద్రాన్ని వైద్యారోగ్య కమిషనర్ వాకాటి కరుణ, జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి మంత్రి ప్రారంభించారు. అంతకు ముందు చిన్నారులకు మంత్రి పోలియో చుక్కలు వేశారు.
డయాగ్నోస్టిక్ ద్వారా అందే సేవల తీరుతెన్నుల గురించి వైద్యారోగ్య కమిషనర్ వాకాటి కరుణ... మంత్రికి వివరించారు. రోగుల సహాయకుల విశ్రాంతి గదిని మంత్రి ప్రారంభించారు. ఏ వ్యాధి నిర్ధరణ పరీక్షలైన ఇక్కడే నిర్వహించనున్నట్లు హరీశ్‌రావు స్పష్టం చేశారు.