Minister Harish Rao meeting in Siddipet district: సిద్దిపేట జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గుండె, క్యాన్సర్, కిడ్నీలాంటి వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తామని తెలిపారు. కాళ్లకుంట కాలనీలో బస్తీ దవాఖానను మంత్రి ప్రారంభించారు.
పేద ప్రజలకు వైద్యం మరింత అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అనంతరం 3వ వార్డులో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, సొంతింటి స్థలంలో ఇళ్లు కట్టుకునే వారికి 3లక్షల ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.