పల్లె ప్రగతి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పల్లె ప్రగతి పనులపై జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డితో కలిసి మంత్రి సమీక్షించారు. త్వరలో గ్రామాల్లో పల్లె ప్రగతి పనులపై ఉన్నతాధికారుల బృందం తనిఖీలు చేపట్టాలని హరీశ్ రావు నిర్ణయించారు.
నిర్లక్ష్యం వహించకుండా అధికారులు జాగ్రత్తపడాలి: హరీశ్ రావు - మంత్రి హరీశ్ రావు
పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా అధికారులు జాగ్రత్తపడాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. గజ్వేల్లో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డితో కలిసి హరీశ్ రావు సమీక్షించారు.
నిర్లక్ష్యం వహించకుండా అధికారులు జాగ్రత్తపడాలి: హరీశ్ రావు
పనితీరు సరిగా లేని గ్రామ పంచాయతీలపై వేటు పడుతుందని హెచ్చరించారు. అధికారులంతా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు.
ఇవీ చూడండి:మహా శివరాత్రికి ముస్తాబైన రామేశ్వరం