మానవ వ్యర్థాల నిర్వహణ కోసం రాష్ట్రంలో మొదటి సారిగా సిద్దిపేటలో ప్లాంట్‌ను నిర్మించామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సెప్టిక్‌ట్యాంక్ నుంచి తీసుకొచ్చిన వ్యర్థాల నిర్వహణకోసం రూ.2.25కోట్లతో ప్లాంటు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. భవిష్యత్తులో అన్ని మున్సిపాలటీలోను ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వ్యర్థాల నుంచి వచ్చిన ఎరువులను రైతులు తీసుకెళ్లే విధంగా తయారుచేయాలని సూచించారు. నీటిని పార్కులోని చెట్లకు మళ్లించాలన్నారు.
సిద్దిపేటలో తొలిసారిగా మానవ వ్యర్థాల ప్లాంటు: హరీశ్‌రావు - చెత్త ప్లాంటును ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట రూరల్ మండలంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బుస్సాపూర్‌లో నిర్మించిన తడి, పొడి వ్యర్థాలను వేరుచేసే కేంద్రాన్ని, ప్లాస్టిక్ నుంచి ఇటుకలు తయారుచేసే యంత్రాన్ని, పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనాన్ని ప్రారంభించారు.
సిద్దిపేటలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
అనంతరం ప్లాస్టిక్ ద్వారా ఇటుకలు తయారుచేసే యంత్రాన్ని ప్రారంభించారు. వీటిని ఇంటి నిర్మాణంలోను, పార్కింగ్ ప్రదేశాల్లోను ఉపయోగించుకోవచ్చని మంత్రి తెలిపారు.