సిద్దిపేటలోని శ్రీరామకుంట్ల శ్మశానవాటికను మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా పర్యటించారు. శ్మశాన వాటికలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను మంత్రి ఆదేశించారు. శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలన్నారు. ఎక్కడా కూడా చెత్త, పిచ్చి మొక్కలు కనపడకూడదన్నారు. పిడకలు, కర్పూరం నెయ్యి వంటి వాటితో అంత్యక్రియలు జరిపేలా ప్రోత్సహించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు.
శ్మశాన వాటికను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు - siddipet district today news
సిద్దిపేటలో శ్రీరామకుంట్ల శ్మశానవాటికను మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా పరిశీలించారు. పిడకలు, కర్పూరం నెయ్యి వంటి వాటితో అంత్యక్రియలు జరిపేలా ప్రోత్సహించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులకు మంత్రి సూచించారు.
శ్మశానవాటికను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ నగరంలోని మహాప్రస్థానం, ఇతర ప్రాంతాల్లోని శ్మశాన వాటికల నిర్వహణ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. వాటికి భిన్నంగా శ్రీరామకుంట్ల శ్మశాన వాటికను తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు. రాష్టానికే ఆదర్శంగా నిలిచేలా ఉండాలని అందుకు తానూ పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు.
ఇదీ చూడండి :తేనెటీగల దాడిలో దివ్యాంగుడు మృతి
TAGGED:
సిద్దిపేట జిల్లా వార్తలు