సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ మంగళవారం పర్యటించనున్నారు. కొండపోచమ్మ జలాశయం నుంచి వర్గల్ నవోదయ వద్ద సంగారెడ్డి కాలువకు... పాములపర్తి వద్ద గజ్వేల్ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా మంత్రి హరీశ్‌రావు క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
నదికి కొత్త నడక నేర్పిన అపూర్వ ఘట్టం మంగళవారం గజ్వేల్‌లో ఆవిష్కృతమవుతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతుల దశ దిశ మార్చే సందర్భం ఇదన్నారు. హల్వి మంజీర నుంచి నిజాంసాగర్‌లోకి గోదావరి జలాల విడుదలతో 32 చెక్ డ్యాంలు గోదావరి నీటితో జలకళను సంతరించుకుంటాయని హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ జలాలతో వేసవిలో14,268 ఎకరాల వరి పంటను కాపాడుకోగలమని తెలిపారు.