తెలంగాణ

telangana

ETV Bharat / state

కళాశాల నిర్మాణ పనులపై మంత్రి హరీశ్​ ఆరా - harish rao news today

సిద్దిపేటలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ  పనులను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. జరుగుతున్న పనులు, అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పూర్తిస్థాయిలో పరిష్కరిస్తానని హామీనిచ్చారు.

కళాశాల నిర్మాణ పనులపై మంత్రి హరీశ్​ ఆరా

By

Published : Nov 1, 2019, 3:28 PM IST

సిద్దిపేటలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు పరిశీలించారు.

జరగుతున్న పనుల గురించి ఆరా తీశారు. ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు, విద్యార్థులకు సూచించారు. పనులు తొందరగా పూర్తిచేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు తెలిపారు.

అనంతరం ప్రయోగశాలను పరిశీలించిన హరీశ్​... ల్యాబ్ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా...తన దృష్టికి తీసుకురావాలని.. పూర్తిస్థాయిలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

కళాశాల నిర్మాణ పనులపై మంత్రి హరీశ్​ ఆరా

ఇదీ చూడండి : 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లానొదిలేశాడు'

ABOUT THE AUTHOR

...view details