అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రిలో వైద్య సేవలు చాలా బాగున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామ శివారులో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.
'ఎల్పీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో వైద్య సేవలు బాగున్నాయి' - minister inspection
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామ శివారులో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా పరిశీలించారు. వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు, అవసరమైన అంశాలపై ఎల్వీ ప్రసాద్ వైద్యులను ఆరా తీశారు.
!['ఎల్పీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో వైద్య సేవలు బాగున్నాయి' minister harish rao inspected lv prasad hospital in kondapaka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8262441-201-8262441-1596300142256.jpg)
minister harish rao inspected lv prasad hospital in kondapaka
ప్రైవేటు దవాఖానకు వెళ్లే బదులుగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందాలని ప్రజలకు మంత్రి సూచించారు. ఈ మేరకు ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు, అవసరమైన అంశాలపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రి ఆవరణలో బస్టాండ్ కావాలని కోరగా... వెంటనే అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, ఏఏంసీ ఛైర్మన్ పాల సాయిరాం, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.