సిద్దిపేట పట్టణాన్ని క్రీడా హబ్‌గా మారుస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లాలోని రంగనాయక సాగర్ కట్టపై సిద్దిపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్, సిద్ధిపేట స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ రాష్ట్ర స్థాయి రోడ్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి జీవితంలో ఒడుదొడుకులను తట్టుకునే శక్తి క్రీడల వల్ల లభిస్తుందని అన్నారు. సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు చుట్టూ రెండు కిలమీటర్ల మేర సింథటిక్ సైక్లింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్‌లను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
జిల్లాను క్రీడా హబ్‌గా మారుస్తాం: మంత్రి హరీష్‌రావు - మంత్రి హరీష్‌రావు తాజా వార్తలు
తల్లిదండ్రులు విద్యతో పాటు క్రీడలకు సమప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు సూచించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్, సిద్ధిపేట స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ రాష్ట్ర స్థాయి రోడ్ సైక్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ఆయన ప్రారంభించారు.
జిల్లాను క్రీడా హబ్‌గా మారుస్తాం: మంత్రి హరీష్‌రావు
సైక్లింగ్ క్రీడాకారులకు అన్నీ విధాలుగా అండగా ఉంటామని మంత్రి హరీష్‌రావు అన్నారు. వారికి కావాల్సిన పరికరాలను త్వరలోనే అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా రంగనాయక్ సాగర్ కట్టపై సైక్లింగ్ పోటీలు నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలను కూడా కట్టపై నిర్వహించాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:యువత అన్ని రంగాల్లో ఆల్‌రౌండర్‌గా రాణించాలి: హరీశ్‌రావు
Last Updated : Feb 8, 2021, 2:58 PM IST