సిద్దిపేట జిల్లాలోని సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో మంత్రి హరీశ్‌రావు (harish rao) పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇళ్ల.. గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందించారు. గ్రామస్థులంతా ఐక్యంగా ఉండి పరిసరాలు శుభ్రంగా ఉంచుకుని... గ్రామాన్ని పచ్చగా తీర్చిదిద్దాలని మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు. తనను ఈ స్థాయికి తెచ్చిన ఊరు కాబట్టి... మొదటగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. దశల వారీగా ఈ పథకాన్ని రాష్ట్రమంతా విస్తరించే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని మంత్రి హరీశ్‌రావు వివరించారు.
harish rao: 'సీఎం కేసీఆర్ పేరు నిలబెట్టాలి'
సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా గ్రామాలను తీర్చిదిద్దాలని మంత్రి హరీశ్‌రావు (harish rao) పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలోని ముఖ్యమంత్రి స్వగ్రామం చింతమడకలో 30 నూతన సామూహిక గృహా ప్రవేశాలకు హాజరైన హరీశ్‌రావు... లబ్ధిదారులను ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
గ్రామస్థులంతా ఐక్యంగా ఉండి మొదట్లోనే ఇళ్లు కూలగొట్టుకున్నారు కనుక మీ నూతన గృహాలను తొందరగా ప్రారంభించుకున్నాం. హరీశ్నగర్లో 30 ఇళ్లు ప్రారంభించుకున్నాం. ఇంకో 12 ఇళ్లు అవసరమవుతాయని చెప్పారు. ఇంకో మూడునెలల్లోగా వాటిని కూడా పూర్తి చేస్తాం. మీరు కూడా ఇళ్లను శుభ్రంగా.. సీఎం కేసీఆర్ పేరు నిలబెట్టుకునేలా ఉంచుకోవాలి. ఊరు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టూ చెట్లను పెంచుకోవాలి. చెత్తరహిత గ్రామంగా.. ఒక ఆదర్శగ్రామంగా మార్చినప్పుడే సీఎం కేసీఆర్ సంతోషపడతారు. మీరందరు మీ కాళ్లమీద నిలబడి ఉపాధి కల్పించుకుని.. ఇంకో నలుగురికి బతుకుదెరువు చూపించే విధంగా అవకాశాలు అందిపుచ్చుకుని అందరూ ముందుకుసాగాలి. -హరీశ్‌రావు, ఆర్థిఖ శాఖ మంత్రి.
ఇదీ చూడండి:CM KCR: 'పోతిరెడ్డిపాడును అంగీకరించం.. రాయలసీమ ఎత్తిపోతలా అక్రమమే'