అన్ని క్రీడలకు సిద్దిపేట వేదిక కానుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 6వ అంతర్ జిల్లాల సీనియర్ వాలీబాల్ ఛాంపియన్ షిప్-2021 పోటీలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు సిద్దిపేట వేదక కావడం గౌరవంగా ఉందని మంత్రి వెల్లడించారు. వాలీబాల్ అనేది గ్రామీణప్రాంత యువతకు అందుబాటులో ఉండే గేమ్ అని... విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని తెలిపారు.
త్వరలో సిద్దిపేటకు వాలీబాల్ అకాడమీ: హరీశ్‌రావు
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 6వ తెలంగాణ అంతర్ జిల్లాల సీనియర్ వాలీబాల్ ఛాంపియన్ షిప్ -2021 పోటీలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. త్వరలో సిద్దిపేటకు వాలీబాల్ అకాడమీ రానుందని వెల్లడించారు.
త్వరలో సిద్దిపేటకు వాలీబాల్ అకాడమీ: హరీశ్‌రావు
పిల్లలకు ఆస్తి ఇవ్వడం కాదు.. క్రీడలు నేర్పించడం ముఖ్యమని హరీశ్ రావు చెప్పారు. ఆరోగ్యం లేకుంటే.. అర్థం లేదన్నారు. రాబోయే రోజుల్లో సిద్దిపేటలో వాలీబాల్ అకాడమీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాతీయస్థాయి వాలీబాల్ ట్రోఫీ అతి పెద్ద సిద్ధిపేట వేదిక కావాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో సిద్దిపేట జడ్పీ ఛైర్మన్ రోజా శర్మ, మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, పీఈటీలు క్రీడాకారులు పాల్గొన్నారు.