క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలను ప్రారంభించారు. పట్టణంలో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని జిల్లాల్లో క్రీడలకు ప్రాధాన్యం దక్కేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. క్రీడాకారులు జాతీయస్థాయిలో ప్రతిభ చాటాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. గ్రామీణ క్రీడలకు సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
గజ్వేల్‌లో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేస్తాం: హరీశ్‌రావు - సిద్దిపేట వార్తలు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభించారు. గతేడాది రోడ్డు ప్రమాదంలో గొర్రెలను కోల్పోయిన బాధితులకు... జాతీయ విపత్తు నిర్వహణ కింద మంజూరైన మొత్తాన్ని అందించారు.
గజ్వేల్‌లో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేస్తాం: హరీశ్‌రావు
అంతకుముందు జరిగిన కార్యక్రమంలో గొర్ల పెంపకందార్లకు మంత్రి అండగా నిలిచారు. గజ్వేల్-కోమటిబండ శివారులో గతేడాది రోడ్డు ప్రమాదంలో 117 గొర్రెలు మృత్యువాత పడగా.. పెంపకందార్లకు ఆర్థిక సాయం అందించారు. జాతీయ విపత్తు నిర్వహణ నిధి కింద మంజూరైన 3లక్షల 42 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.
ఇదీ చూడండి:'వంటిమామిడి నుంచి కూరగాయలు సరఫరా చేయొచ్చా?'
Last Updated : Jan 28, 2021, 10:55 PM IST