సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, జడ్పీ ఛైర్మన్ రోజా శర్మ పర్యటించారు. మండలంలోని మాచిన్‌పల్లిలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. శేరిపల్లి బందారంలో ఒక కోటి ఇరవై లక్షలతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. మల్లేశం పల్లిలో ఒక కోటి పది లక్షలతో డబుల్ బెడ్రూం ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా భాజపాపై మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. దుబ్బాకలో ఓటు అడగాలంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలన్నారు.
విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు - siddipet district news
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. మాచిన్‌పల్లిలో 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు.
![విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు Minister Harish Rao inaugurated the power substation in siddipet district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8814674-1022-8814674-1600186581365.jpg)
విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
తెలంగాణ వచ్చిన తర్వాతనే రైతులకు కొద్దిగా గౌరవం వచ్చిందని మంత్రి అన్నారు. అన్నదాతలకు ఎకరానికి రైతుబంధు కింద ఐదు వేల రూపాయలు ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగకుండా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ఇళ్లు కట్టుకునే పేదలకు టీఎస్‌బీపాస్ బ్రహ్మాస్త్రం: కేటీఆర్