Harish Rao Comments on BJP: భాజపా సర్కార్‌కు వడ్లు కొనడం చేతకాదు గానీ కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వచ్చని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా సిద్దన్నపేట మార్కెట్ యార్డులో వడ్లకొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన.. జిల్లాలో 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతోందని హర్షం వ్యక్తం చేసిన ఆయన.. దేశంలో పలు రాష్ట్రాలు తెలంగాణ ధాన్యం కొంటున్నాయని వెల్లడించారు.
'వడ్లు కొనడం చేతకాదు గానీ.. కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటారు' - భాజపా సర్కార్‌పై హరీశ్ విమర్శలు
Harish Rao Comments on BJP: భాజపా సర్కారుకు వడ్లు కొనమంటే చేతకాదు కానీ రూ.కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా సిద్దన్నపేట మార్కెట్ యార్డులో వడ్లకొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన..జిల్లాలో 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. క్వింటాల్‌కు రూ.2060లకు వడ్లు కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. క్వింటాల్‌కు రూ. 2060 వడ్లు కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ధాన్యం ఇచ్చిన రైతులకు రెండు రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. పెద్ద రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఆయన.. రైతులకు ఆయిల్ పామ్ సాగు లాభదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ రాష్ట్ర సమితి కోసం నంగునూరు మార్కెట్ కమిటీ సభ్యులు రూ.10 లక్షలను మంత్రి హరీశ్‌రావుకు అందించారు.
ఇవీ చదవండి: