తెలంగాణ

telangana

కేంద్రం కోత పెడితే.. రాష్ట్రం కడుపు నింపింది : హరీశ్ రావు

రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేటలోని తొమ్మిదో వార్డును రూ.9 కోట్లతో అభివృద్ధి చేశామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు జడ్పీటీసీలకు బడ్జెట్​లో రూ.500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

By

Published : Mar 19, 2021, 6:06 PM IST

Published : Mar 19, 2021, 6:06 PM IST

minister harish rao inaugurated several development works in siddipet
కేంద్రం కోత పెడితే.. రాష్ట్రం కడుపు నింపింది

గత ప్రభుత్వాలు ఎంపీటీసీ, జడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా బడ్జెట్​లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర సర్కార్ స్థానిక సంస్థలకు రూ.699 కోట్లు కోత పెడితే రాష్ట్ర ప్రభుత్వం కడుపు నింపిందని అన్నారు.

సిద్దిపేటలో పర్యటించిన మంత్రి.. పలు వార్డుల్లో సీసీరహదారులకు శంకుస్థాపన చేశారు. పలు భవనాలను ప్రారంభించారు. పట్టణ పరిధిలోని తొమ్మిదో వార్డు రంగదాంపల్లి అభివృద్ధికి రూ.9 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా ప్రతి నెల రూ.300 కోట్లు ఖర్చు చేస్తుందని హరీశ్ రావు వెల్లడించారు. త్వరలోనే మహిళలకు వడ్డీలేని రుణాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లాలో ఐటీ పార్క్ ఇండస్ట్రియల్ రావడం ద్వారా ఈ ప్రాంత యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details