సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు పర్యటించారు. గుర్రాలగొంది గ్రామంలో 30 రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు.
'రాబోయే రోజుల్లో రాష్ట్రమంతటా రెండు పడక గదుల ఇళ్లు' - minister harish rao visited siddipet
రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలో పర్యటించిన ఆయన.. గుర్రాలగొంది గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు.
గుర్రాలగొందిలో డబుల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభించిన హరీశ్ రావు
వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నా.. ఒక్క చెరువు కట్ట తెగలేదంటే మిషన్ కాకతీయ పథకం ఘనతేనని మంత్రి అన్నారు. గుర్రాలగొంది గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు గ్రామంలో మార్కెట్ నిర్మాణం చేపడతామని తెలిపారు.
- ఇదీ చూడండి:సీనియర్ల లేఖపై రాహుల్ గాంధీ ఆగ్రహం