పింఛనుదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొండంత సాయం చేస్తే.. భాజపా నేతలు అది తమ ఘనత అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గం రామక్కపేటలో తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి.. మంత్రి ఉపఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, భాజపా నేతల తీరుపై హరీశ్‌రావు మండిపడ్డారు.
దుబ్బాక పోరు: భాజపా నేతల తీరుపై మంత్రి హరీశ్‌రావు ఫైర్ - Dubbaka By-Election Campaign
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉపఎన్నికల ప్రచారం కొనసాగుతున్నది. కాంగ్రెస్, భాజపా నేతల తీరుపై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. పింఛన్లలో కేంద్రం వాటా 2 శాతం కంటే తక్కువేనని మంత్రి అన్నారు.
దుబ్బాక పోరు: భాజపా నేతల తీరుపై మంత్రి హరీశ్‌రావు ఫైర్