దుబ్బాక ఉపఎన్నికలో తెరాస గెలుపు ఖాయమైందని మంత్రి హరీశ్‌రావు జోస్యం చెప్పారు. 99 శాతం మంది దుబ్బాక ప్రజలు తెరాసలోనే ఉన్నారన్నారు. గతంలో ఎప్పుడూ దుబ్బాక రాని కాంగ్రెస్ నేతలు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు వస్తున్నారని.. వచ్చి ఏంచేస్తారని ప్రశ్నించారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఓ ఫంక్షన్ హాల్లో చీకోడు, మిరుదొడ్డి, గొడుగుపల్లి ఎంపీటీసీలు, పలువురు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో తెరాసలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఫార్ హుస్సేన్ టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.