రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గ కేంద్రంలోని తన నివాసంలో అర్హులైన 142 మందికి కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు దృష్టిసారించాలి: హరీశ్‌రావు - సిద్దిపేట జిల్లాలో కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు పరుస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో 142 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి హరీశ్‌రావు
అర్హులైనవారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు దృష్టిసారించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. భాజపా పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, కాంగ్రెస్, శివసేన అధికారంలో ఉన్న మహారాష్ట్రాలోనూ ఇలాంటి పథకాలు లేవని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Errabelli: బంగారు తెలంగాణ కోసం సీఎం కృషి చేస్తున్నారు: ఎర్రబెల్లి