తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇప్పట్లో కరోనా పోదు.. జాగ్రత్తలు తప్పనిసరి...'

సిద్దిపేట మున్సిపల్ వార్డులో రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి హరీశ్​రావు శంకుస్థాపన చేశారు. పట్టణాభివృద్ధిలో భాగంగా మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల అభివృద్ధికి దశల వారీగా రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పట్లో కరోనా పోయేటట్లు లేదని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని స్థానికులకు సూచించారు.

By

Published : May 19, 2020, 7:07 PM IST

Minister Harish Rao Foundation stone road Construction at siddipet
రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని 22, 25, 29వ వార్డుల్లో రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. 22వ వార్డులోని సాయి విద్యానగర్ కాలనీ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు, 25వ వార్డులో పోచమ్మ దేవాలయం నుంచి పద్మనాయక ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్డు వరకూ రూ.49.90 లక్షల ఎల్ఆర్ఎస్ నిధులతో బీటీ రోడ్డు, 29వ వార్డులో గాడిచర్లపల్లి బస్ స్టాప్ నుంచి ఎల్లమ్మ కట్ట వరకు సీసీ రోడ్డు నిర్మాణం, ఎల్లమ్మ దేవాలయం నుంచి ఎస్సీ కాలనీ వరకూ రూ.65.80 లక్షల ఎల్ఆర్ఎస్ నిధులతో బీటీ రోడ్డు నిర్మాణ పనులను మొదలు పెట్టారు.

పట్టణంలోని వివిధ వార్డుల్లో రోడ్ల నిర్మాణాలకు వెళ్లిన మంత్రి అక్కడి వృద్ధులతో కరోనా జాగ్రత్తలపై కాసేపు ముచ్చటించారు. కరోనా దృష్ట్యా వృద్ధులు బయటకు రావొద్దని సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో, ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో జనం ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని... రద్దీగా ఉన్న ప్రాంతాల్లో తిరగొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ వార్డు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్ రావు

ఇదీ చూడండి :'కేసీఆర్​తో జగన్​ భేటీ తర్వాతే ఏపీ జీవో ఇచ్చింది'

ABOUT THE AUTHOR

...view details