నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు కేసీఆర్ రైతు పక్షపాతి అని రుజువు చేశాయి మంత్రి హరీశ్‌రావు Minister Harish Rao Fires on Opposition Parties : తెలంగాణలో పర్యటిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నాయకులు వారికి తెలియకుండానే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని.. కేసీఆర్ పాలనను కొనియాడుతున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. తాజాగా హైదరాబాద్‌లో పర్యటించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ రైతుపక్షపాతి అని రుజువు చేశాయని తెలిపారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసిందని ఆయన ఆరోపించారు. అలాంటి పార్టీకి ఓట్లడిగే అర్హత లేదన్నారు.
కాంగ్రెస్‌ను నమ్మితే ఆగమవ్వుడు ఖాయం : హరీశ్‌రావు
Harish Rao on Nirmala Seetharaman Comments : నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను బట్టి కేసీఆర్ రైతు పక్షపాతి అని అందరికీ అర్థమయ్యిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టనందునే రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని నిర్మలా సీతారామన్ చెప్పారని.. రూ.25 వేల కోట్లు నష్టపోతామని తెలిసినా కేసీఆర్ మోటార్లకు మీటర్లు పెట్టలేదని తెలిపారు. 65 లక్షల మంది రైతుల ప్రయోజనాల దృష్ట్యా మోటార్లకు కేసీఆర్ మీటర్లు పెట్టలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో సైతం మోటార్లకు మీటర్లు పెట్టాయని గుర్తు చేశారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే.. రైతుల మోటార్లకు మీటర్లు పెడతారని.. కర్ణాటకలో 5 గంటలే కరెంట్ ఇస్తున్నామని డీకే శివకుమార్ చెప్పారని అన్నారు.
Minister Harish Rao Speech at Medak Public Meeting : 'ఆ రాష్ట్రానికి ఒక నీతి.. మా రాష్ట్రానికి ఒక నీతా..' కేంద్రంపై హరీశ్‌రావు ఫైర్
"రైతుల ప్రాణాలు కావాలా? పైసలు కావాలా? రైతులను ముంచడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేయడం అంటే మోటార్లకు మీటర్లు పెట్టమని ఆహ్వానించడమే. రైతుల గురించి ఆలోచించిన కేసీఆర్‌ను కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలకు లేదా? ఒకవేళ మీటర్లు పెట్టి ఉంటే రూ.25 వేల కోట్ల నిధులు వచ్చేవి కాదా? రూ.25 వేల కోట్ల నిధులు వచ్చుంటే ఇంకా సంక్షేమ పథకాలు అమలు చేసే వాళ్లం. కేవలం రైతుల ప్రయోజనాల దృష్ట్యా మీటర్లు పెట్టలేదు. దిల్లీలో మా ప్రభుత్వానికి బీజేపీ నేతల ప్రశంసలు.. గల్లీలో విమర్శలు. కేంద్రం పదేళ్లలో 100 లక్షల కోట్ల అప్పులు చేసింది. తెలంగాణ జీఎస్‌డీపీలో 28 శాతం అప్పులు చేశాం. దేశ జీడీపీలో కేంద్రం చేసిన అప్పులు 57 శాతం. దేశంలో అత్యంత తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రం తెలంగాణ." -హరీశ్‌రావు, రాష్ట్ర మంత్రి
వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్ముకుంటే - గుండెపోటు గ్యారెంటీ : హరీశ్‌రావు
24 గంటల నాణ్యమైన కరెంట్ కావాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలని హరీశ్ రావు ప్రజలను కోరారు. రైతుల పాలిట బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శత్రువులని విమర్శించారు. రైతులకు మంచి జరగాలని యూపీఏ హయాంలో స్వామినాథన్ ఒక నివేదిక సమర్పించారన్న హరీశ్ రావు.. ఇప్పటికీ స్వామినాథన్ నివేదికను కాంగ్రెస్, బీజేపీలు అమలు చేయలేదని మండిపడ్డారు.
బూతులు మాట్లాడే ప్రతిపక్షాలకు పోలింగ్ బూత్‌లో ప్రజలు బుద్ధి చెబుతారు : హరీశ్ రావు